రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు!

  • జూన్, జులై నెలల్లో ముగియనున్న 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం
  • జూన్ 18న పోలింగ్.. అదే రోజున ఫలితాలు
  • ఏపీలో 4 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్, జులై నెలల్లో పదవీకాలం ముగియనున్న 10 రాష్ట్రాల్లోని మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 4 కీలక స్థానాలు కూడా ఉన్నాయి.


ఎన్నికల షెడ్యూల్:

నోటిఫికేషన్ విడుదల - జూన్ 1
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - జూన్ 8
పోలింగ్, ఫలితాలు - జూన్ 18

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న 4 స్థానాలు ఇవే:
  •  అయోధ్య రామిరెడ్డి (YSRCP)

  • పిల్లి సుభాష్ చంద్రబోస్ (YSRCP)

  •  పరిమళ్ నత్వానీ (YSRCP)

  • సానా సతీష్ బాబు (TDP - గత ఉపఎన్నికలో ఎన్నికయ్యారు)

ప్రస్తుత అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఏపీలోని ఈ నాలుగు స్థానాలూ కూటమి ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. కాకపోతే కూటమిలో సీట్ల సర్దుబాటు, ఎవరెవరికి ఎన్ని సీట్లు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఈ విడతలో జాతీయ రాజకీయాల్లోని అత్యంత కీలక నేతల రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఎన్నికలపై అందరి దృష్టి పడింది.
  • కర్ణాటక (4 స్థానాలు): ఇక్కడి నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడల పదవీకాలం ముగియనుంది.

  • మధ్యప్రదేశ్ (3 స్థానాలు): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పదవీకాలం ముగియనుంది.

  • ఇతర రాష్ట్రాల ఖాళీల వివరాలు: గుజరాత్ (4), రాజస్థాన్ (3), జార్ఖండ్ (2), మణిపూర్ (1), మేఘాలయ (1), అరుణాచల్ ప్రదేశ్ (1), మిజోరాం (1).

సరిగ్గా జూన్ 18న ఒకేరోజు పోలింగ్ జరిపి, అదే రోజు సాయంత్రం ఫలితాలను కూడా ఈసీ ప్రకటించనుంది. 


Rajya Sabha Elections
Andhra Pradesh
Ayodhya Rami Reddy
Pilli Subhash Chandra Bose
Parimal Nathwani
Sana Satish Babu
YSRCP
TDP
Rajya Sabha Seats
Election Schedule

More Telugu News